ysrcp : వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడిచిన ఐదేళ్ల కాలంలో అనేక పదవులు అనుభవించారు. ఎంపీ పదవి నుంచి మొదలుకొని మండల స్థాయి వరకు పదవులు పొందారు. పార్టీ అధికారంలో ఉండేసరికి పార్టీ పదవుల కోసం పోటీ పడ్డారు. పార్టీ పదవి రాని వారు కొందరు అలిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది.
ఏపీలో అధికారం లేకపోవడంతో పార్టీ పూర్వ వైభవం కోసం అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు పదవులను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానంటే కూడా ఎవరు ముందుకు రాకపోవడం విశేషం. ఏపీలో 26 జిల్లాలు ఉన్నవి. అంటే 26 జిల్లాలకు 26 మంది అధ్యక్షులు అవసరం. అంతమంది నాయకులు పదవి భాద్యతలు చేపట్టడానికి ముందుకు రావడం లేదని పార్టీ వర్గాల సమాచారం.
దింతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓ కొత్త నిర్ణయానికి రావడం జరిగింది. 26 జిల్లాలకు అధ్యక్షులను పెట్టకుండా ఉమ్మడి జిల్లాకు ఒక అధ్యక్షున్ని నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు ఒక అధ్యక్షుడు కూడా దొరకడం లేదు. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి పార్టీ జిల్లా అధ్యక్ష భాద్యతలు మోయడానికి ముందుకు రావడం లేదు నాయకులు.
అధికారం లో ఉన్నప్పుడేమో మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు అయ్యా జిల్లా అధ్యక్ష పదవి ఇస్తాం, తీసుకోండి అంటే కూడా ఎవరు ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉంటె ఏదోవిదంగా ఖర్చులు కలిసివచ్చేవి. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతోనే భాద్యతలు ఎత్తుకోడానికి ముందుకు రావడంలేదని పార్టీ వర్గాల సమాచారం.