Home » mlc kavitha : ఎమ్మెల్సీ కవిత మౌనానికి కారణం ఇదే

mlc kavitha : ఎమ్మెల్సీ కవిత మౌనానికి కారణం ఇదే

mlc kavitha : బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు బెయిల్ పై వచ్చారు. బెయిల్ పై జైలు నుంచి బయటకు రాగానే తీవ్రంగా స్పందించారు. వచ్చి రాగానే ఆమె రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడుతారని రాజకీయ వర్గాలు భావించారు. కానీ ఆమె కాంగ్రెస్ పరిపాలన గురించి నోరుమెదపలేదు. నేటికీ ఆమె నిశ్శబ్ద వాతావరణంలోనే కొనసాగుతున్నారు.

జైలు నుంచి బయటకు రాగానే ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. వాస్తవానికి నేను మొండిదాన్ని. కానీ నన్ను జగమొండిని చేశారు అంటూ మాట్లాడారు. ఇంతకూ ఆమె మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించినవి అని రాజకీయ విశ్లేషకులు అనుమానించారు. కానీ ఆమె మాట్లాడిన మాటలు వాస్తవానికి బీజేపీ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు.

ఢిల్లీ నుంచి వచ్చిన మరుసటి రోజు ఆమె కేసీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడే పది రోజుల పాటు ఉంటానని, తనను కలవడానికి ఎవరూ రాకూడదని ప్రకటించారు. పదిరోజుల తరువాత ఆమె తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు ఆశించారు. అంతే కాదు ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి బీజేపీ ని ఎండగడుతారని కూడా భావించారు. కానీ అలాంటివి ఏమి కనబడుటలేదు.

రాష్ట్రంలో ఒకవైపు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ తో యుద్ధం చేస్తున్నారు. హరీష్ రావ్ కూడా పోలీస్ కమిషనర్ ఎదుట ధర్నా చేపట్టి పార్టీ శ్రేణుల్లో ధీమా నింపారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా పార్టీ కార్యక్రమాలపై స్పందిస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఎదో రాజకీయ ఎత్తుల కోసం మౌనంగానే ఉన్నారు. కానీ కవిత మాత్రం నోరు మెదపడంలేదు. ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది బిఆర్ఎస్ శ్రేణుల్లో అంతు చిక్కని ప్రశ్న. బెయిల్ నుంచి వచ్చిన తరువాత మాట్లాడిన మాటలకూ రాజకీయ వర్గాలు వివిధ రకాలుగా ఊహించారు. కానీ ఆ ఊహలకు బిన్నంగా కవిత కనబడుతున్నారు. బీజేపీ లో పార్టీ విలీనం, పొత్తులు అనే అంశాలపై ఆరోపణలను ఎదుర్కొంది పార్టీ. ఆ రెండు అంశాలపైననే కుటుంబ పరంగా కవిత ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *