bjp silience : తెలంగాణ రాష్ట్రంలో కాషాయం నేతలకు మంచి భవిష్యత్తు ఉందనేది స్పష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు గెలిచేవారు. అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది నాయకులు పార్లమెంట్ కు వెళ్లారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే గ్రేటర్ లో బీజేపీ కి చెప్పుకునేంత మంది కార్పొరేటర్లు ఉన్నారు. గ్రేటర్ లో తాజాగా ఈటల రాజేందర్ ఎంపీ గా గెలిచి పెద్ద దిక్కుగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గ్రేటర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇంతటి పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విషయంలో కాషాయం నేతలు మౌనం ఎవరి కోసం వహిస్తున్నారనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నాయి. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు స్థానికత, స్థానికేతర గురించి. ఈటల రాజేందర్ గెలిచింది స్థానికేతరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి అనే విషయం మరచిపోయినట్టు ఉంది బీజేపీ. మల్కాజి గిరిలో ఎక్కువగా ఉంది స్థానికేతరుల ఓట్లు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడింది గాంధీ గురించి. అరకపూడి గాంధీ స్థానికేతరుడు అంటూ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పటికీ బీజేపీ నాయకులు ఎందుకు మౌనం వహించారు అనేది పార్టీ శ్రేణుల్లో అంతు చిక్కని ప్రశ్న. అంతే కాదు పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తికి గురవుతున్నారు. స్థానికేతరులుగా వచ్చి స్థిరపడి బీజేపీ కి నాయకత్వం వహిస్తున్న వారు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కౌశిక్ రెడ్డి మాటలపై పార్టీ స్పందించక పోవడంతో వీరంతా ప్రథమ శ్రేణి నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిన్న, చిన్న విషయాలనే భూతద్దంలో చూసే నాయకులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ఎందుకు నూరు మెదపడంలేదు. అదే విదంగా కిషన్ రెడ్డి నుంచి కూడా స్పందన లేదు. సెటిలర్ల ఓట్లతో గెలిచిన ఈటల రాజేందర్ కూడా మౌనంగానే ఉన్నారు. వీరందరి మౌనం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది .