IFTU : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీహార్ లోని కేహాల్గమ్ లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ తెలిపారు. మంగళ వారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..
కార్మికవర్గాల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం బీహార్ సమావేశాన్ని వేదిక చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జాతీయ , రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్మిక రంగం అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేపట్టనున్నామన్నారు. అదే విదంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకునే వరకు శాంతియుత పోరాటాలు దేశవ్యాప్తంగా కొనసాగుతాయన్నారు.
ఈ సమావేశంలో ఐ ఎఫ్ టీ యు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, జిల్లా నాయకులు ఐ రాజేశం, జీ మల్లేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్ తోపాటు పలువురు జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

by