Heroes : క్షుద్ర శక్తుల నేపధ్యంలో నిర్మాణమయ్యే సినిమా కథలకు కొత్త ఊపు వస్తోంది. సరైన కథను ఎంచుకొని పక్కా ప్లాన్ తో సినిమా తీసిన నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన హారర్ సినిమాలను అభిమానులు ఇష్టపడు తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకే నేటి తరం హీరోలు భూత వైద్యం సినిమా కథలను నమ్ముకొని ఎంపిక చేసుకొంటున్నారు.
’12A రైల్వే కాలనీ’ లో అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం కూడా ఆత్మల చుట్టూ అల్లుకొని ఉంది. అల్లరి నరేష్ సినిమా పూర్తయ్యే వరకు ఆత్మలతో మాట్లాడుతారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేసవి కాలంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
రెబల్ స్టార్ నటించనున్న అతి పెద్ద భారీ చిత్రం కూడా బూత వైద్యం తో నిర్మాణమవుతోంది. ఈ సినిమా పూర్తిగా హర్రర్ తోనే ఉంటుంది. ఇందులో మూడు తరాల ఆత్మకథలు ఉంటాయి. ఈ సినిమా కథను మారుతీ పూర్తి చేయడం విశేషం.
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కలయికలో కామెడీ హారర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో కూడా ఆత్మలు, భూత వైద్యం ప్రధానంగా కథలో ఉంటాయి. రాయలసీయ, కొరియన్ ఆత్మ కథ ప్రధాన అంశంతో కథను తయారు చేస్తున్నారు మేర్లపాక గాంధీ.