Ramcharan : గేమ్ చేంజర్ సినిమా టికెట్ల అమ్మకాలు రోజు,రోజుకు పెరిగిపోతున్నాయి. వరుస సెలవులు కావడంతో సినిమా థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి పెరిగిపోతోంది. గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్ర ప్రశంసలు అందుకుంటున్నాడు రాంచరణ్. దింతో అభిమానుల్లో అభిమానం వ్యక్తం అవుతోంది. సినిమా చూసిన మెగాస్టార్ కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి పదో తేదీన వచ్చింది. విడుదల అయిన మొదటి రోజు ఈ సినిమా రూ.186 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ కలెక్షన్ ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదొక బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించింది చిత్ర బృందం.
అయితే ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న దేవర సినిమా విడుదల అయిన మొదటి రోజు రూ.172 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. అదేవిదంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల అయిన మొదటి రోజు రూ.294 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డ్ నమోదు చేసుకొంది. ఇప్పుడు తాజాగా విడుదల అయిన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రూ.186 కోట్లు రాబట్టడంతో రెండో స్థానం నమోదు చేసుకొంది.