NIGAMA MEDIA (P) LTD
-0.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 26, 2026

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. హక్కులను పరిరక్షించుకుందాం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

పట్టణంలోని సింగరేణి హైస్కూల్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాదాసీ రవీందర్, విశిష్ట అతిథిగా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ముఖ్య అతిథి కాదాసీ రవీందర్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, భారత ప్రజలకు సమర్పించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. విశిష్ట అతిథి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. భారత రాజ్యాంగమే దేశ ప్రజలకు రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఆలోచనలు, బీఎస్పీ నాయకురాలు మాయావతి సిద్ధాంతాల స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఈసీ సభ్యుడు ఎండీ మాతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుంటాల శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు ఆయిల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.