రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. హక్కులను పరిరక్షించుకుందాం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలోని సింగరేణి హైస్కూల్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాదాసీ రవీందర్, విశిష్ట అతిథిగా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథి కాదాసీ రవీందర్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ...