NIGAMA MEDIA (P) LTD
1.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 15, 2026

బీబీపేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని చారిత్రక పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని తాజా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి  కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నైజాం కాలం నుంచి ఉన్న ఈ చెరువు సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండటంతో పాటు, దాదాపు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ఈ చెరువుపై ఏడు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి చెరువుకు మరమ్మతులు చేపట్టాలని, చెరువు కట్టను సుందరంగా తీర్చిదిద్ది మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందులో భాగంగా కట్టపై ఈత, మామిడి, సీతాఫలం, జామ, నేరేడు తదితర వివిధ రకాల మొక్కలు నాటాలని సూచించారు. చిన్నారుల కోసం ఆటవస్తువులు, యువతకు వ్యాయామ పరికరాలు, వాకింగ్ ట్రాక్, ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీబీపేట పెద్ద చెరువుపై ఉప్పరపల్లి, ఇస్సానగర్, తుజాల్‌పూర్, షేర్, బీబీపేట, యాడారం, మల్కాపూర్, మందాపూర్, జనగామ తదితర గ్రామాల రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఈ చెరువు నిండితే వెయ్యి ఎకరాలకు పైగా సాగుభూమికి నీరందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

గతంలో మల్లన్నసాగర్‌ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బీబీపేట చెరువును నింపుతామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీలు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలోని రైతుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని పేర్కొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.