బీబీపేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని చారిత్రక పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని తాజా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి  కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నైజాం కాలం నుంచి ఉన్న ఈ చెరువు సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండటంతో పాటు, దాదాపు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ఈ చెరువుపై ఏడు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం...