NIGAMA MEDIA (P) LTD
6.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 10, 2026

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మానేరు రివర్ ఫ్రంట్, డంపింగ్ యార్డు పరిశీలన
సాయంత్రం మీడియా సమావేశం
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను పెద్దపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ వెల్లడించారు.

పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 4 గంటలకు మానేరు నది వద్ద నిర్మాణంలో ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను కవిత పరిశీలిస్తారు. అనంతరం 4.30 గంటలకు డంపింగ్ యార్డును సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్ రోడ్డు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు ఎల్లారెడ్డిపేటలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మాజిద్ నివాసాన్ని సందర్శించనున్నారు.

కవిత పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ రక్షణ సేన నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ విజ్ఞప్తి చేశార

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.