NIGAMA MEDIA (P) LTD
6.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 10, 2026

అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
రాత్రి పెట్రోలింగ్, పోలీస్ నిఘా పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలను సందర్శించిన ఆయన, రైల్వే సిబ్బంది, దుకాణాల యజమానులు, ప్రయాణికులతో మాట్లాడి అక్కడి భద్రతా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న రాత్రి పెట్రోలింగ్, నిఘా చర్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పర్యవేక్షణను పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు, వ్యాపార సంస్థలు నిర్ణీత సమయపాలన పాటిస్తున్నాయా లేదా అనే అంశంపై తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాత్రి వేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పోలీస్ నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.