NIGAMA MEDIA (P) LTD
5.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

కరువు మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
సీపీఐ నేత కలవేన శంకర్

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

రాష్ట్రంలోని కరువు మండలాల్లో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి, ఆదిల్పేట, పొన్నారం, శంకర్‌పల్లె, చిర్రకుంట గ్రామాల్లో ఆయన పర్యటించి, వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 369 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు రైతులకు ఎలాంటి సహాయక చర్యలు అందించకపోవడం విచారకరమన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగ సంక్షేమాన్ని పాలకులు విస్మరించడం దారుణమని విమర్శించారు.

ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలతో పాటు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన ఇతర మండలాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించి, వారికి భరోసా కల్పించాలని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నవంబర్ 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలవేన శంకర్ వెల్లడించారు.

ఈ పర్యటనలో రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి వెంకటస్వామి, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, భీమనాధుని సుదర్శన్, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, కామెర దుర్గారాజ్, మిట్టపల్లి పౌలు, బొంతల లక్ష్మీనారాయణ, ఆడపు రాజమౌళి, గుండా మాణిక్యం, మామిడి గోపి, నక్క వెంకటస్వామి, జాడిపోశం, దేవి పోశం, పూజారి రామన్న, కొత్తపెళ్లి మహేష్, పెరిక సంపత్, మేకల రాజేశం, రత్నం రాజం, దొంతుల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.