కరువు మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి సీపీఐ నేత కలవేన శంకర్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): రాష్ట్రంలోని కరువు మండలాల్లో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి, ఆదిల్పేట, పొన్నారం, శంకర్‌పల్లె, చిర్రకుంట గ్రామాల్లో ఆయన పర్యటించి, వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో...