NIGAMA MEDIA (P) LTD
8.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం
మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలందరిలో ఐకమత్య భావన బలపడాలని మందమర్రి తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం మందమర్రి మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతదేశ ఐక్యతకు పటిష్టమైన పునాదులు వేసిన మహనీయుడు పటేల్ అని పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి, అంకితభావం, కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం నుంచి గ్రామస్థాయి వరకు ఐక్యతా భావాన్ని పెంపొందించుకోవాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడంతో పాటు ఐకమత్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తహసీల్దార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అంజన్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.