NIGAMA MEDIA (P) LTD
8.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

ముదిరాజుల హక్కులను విస్మరించి ‘బీసీ రాజ్యాధికారం’ ఎలా సాధ్యం?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కల్పించిన తర్వాతే ఐక్యతకు అర్థం
ఓట్ల కోసం ఐక్యత నాటకాలు ఆపాలి
ముదిరాజుల బహిరంగ ప్రకటన
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీసీ రాజ్యాధికారం అనే నినాదంతో ముందుకు వస్తున్న నాయకులు ముందుగా తమ ద్వంద్వ వైఖరికి సమాధానం చెప్పాలని ముదిరాజు సమాజం డిమాండ్ చేస్తోంది. బీసీ సమాజంలోని ప్రతి కులానికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక భద్రత కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాన్ని విస్మరించి, కేవలం ఎన్నికలు, పదవుల కోసం బీసీ ఐక్యత పేరుతో ముందుకు రావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.

రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకత.. అధికారం కోసం ఐక్యతా?

ముదిరాజులను బీసీ-ఎ (BC-A) జాబితాలో చేర్చి, వారికి చట్టబద్ధమైన రిజర్వేషన్ హక్కులు కల్పించాలనే డిమాండ్ వచ్చినప్పుడు కొందరు బీసీ నాయకులు, కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ముదిరాజు సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్నికలు, రాజకీయ పదవులు, బీసీ రాజ్యాధికారం అనే అంశాలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రం ముదిరాజులు తమ సోదరులని, అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునివ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించింది.హక్కులు కల్పించేందుకు ముందుకు రాని నాయకులు, ఓట్లు మరియు జనాభా బలం కోసం ముదిరాజులను కలుపుకోవాలని చూడటం స్వార్థపూరిత రాజకీయమేనని పేర్కొంది.

ముదిరాజులను ఓటు బ్యాంకుగా చూడొద్దు

ముదిరాజులకు దక్కాల్సిన రిజర్వేషన్లు, సామాజిక న్యాయం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, మరోవైపు వారి జనాభా బలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని చూడటం సమాజాన్ని వంచించడమేనని స్పష్టం చేసింది. ముదిరాజుల హక్కులపై చర్చ వచ్చినప్పుడు మౌనం వహిస్తూ, రాజ్యాధికారం పేరుతో అసలు సమస్యలను పక్కదారి పట్టించడం సరికాదని పేర్కొంది.

సామాజిక న్యాయం లేనిదే రాజ్యాధికారం సాధ్యం కాదు

బీసీ సమాజంలోని అంతర్గత అసమానతలను తొలగించి, ప్రతి కులానికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కల్పించినప్పుడే నిజమైన ఐక్యత సాధ్యమవుతుందని ముదిరాజు సమాజం అభిప్రాయపడింది. ముదిరాజుల రిజర్వేషన్ డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించకుండా బీసీ రాజ్యాధికారం గురించి మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న నినాదంగానే మిగిలిపోతుందని విమర్శించింది.

ముదిరాజుల స్పష్టమైన డిమాండ్

ముదిరాజుల హక్కులను విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించింది. ముదిరాజులను బీసీ-ఎ జాబితాలో చేర్చేందుకు మద్దతు ప్రకటించడంతో పాటు, వారికి తగిన రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక భద్రత కల్పించే దిశగా నాయకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేసింది.మా రిజర్వేషన్లు – మా హక్కులు సాధించిన తర్వాతే ఐక్యత.. ఆ తర్వాతే రాజ్యాధికారం! ముదిరాజుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని బహిరంగ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.