దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలందరిలో ఐకమత్య భావన బలపడాలని మందమర్రి తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం మందమర్రి మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.....