NIGAMA MEDIA (P) LTD
8.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

మందమర్రిలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలే మార్గం
ఏఐటీయూసీ నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని కేకే-5 గని, కేకే ఓసీపీ ప్రాజెక్టు, ఏరియా వర్క్‌షాప్, సివిల్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయం వద్ద పిట్ కార్యదర్శుల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1920 అక్టోబర్ 31న స్థాపించబడిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) భారత కార్మికోద్యమ చరిత్రలో సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కార్మికుల హక్కులు, గౌరవం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఏఐటీయూసీ అలుపెరగని పోరాటాలు సాగిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేసి ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, పెన్షన్, బోనస్, సెలవులు వంటి అనేక హక్కుల సాధనలో కార్మిక సంఘాల పోరాటాలు కీలక పాత్ర పోషించాయని వివరించారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ఏఐటీయూసీ నిరంతరం ఉద్యమిస్తోందని తెలిపారు.

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలోనూ ఏఐటీయూసీ అనేక చారిత్రక పోరాటాలకు నాయకత్వం వహించిందని పేర్కొన్నారు. వేతన ఒప్పందాలు, బోనస్, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, కార్మిక సంక్షేమం, వారసత్వ ఉద్యోగాలు తదితర సమస్యల పరిష్కారంలో యూనియన్ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్మికులకు వారి కష్టార్జితంలో న్యాయమైన వాటా సాధించడంతో పాటు సంస్థ అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మారుతున్న పారిశ్రామిక పరిస్థితుల్లో కార్మిక హక్కుల పరిరక్షణ, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం కోసం మరింత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతే అసలైన బలమని, సంఘటిత పోరాటాలతోనే హక్కులను కాపాడుకొని భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించగలమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచి సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, ఏరియా నాయకులు పెద్దపల్లి భానయ్య, ఎగేటి రాజేశ్వరరావు, జెట్టి మల్లయ్య, అంతోని దినేష్, ముద్దసాని కోటయ్య, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, సీహెచ్‌పీ శర్మ, కలువల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్ కుమార్, పిట్ నాయకులు ప్రేమ్‌లాల్, రాజేందర్, జి. రాంబాబు, హేమచందు, బత్తుల రామన్న, కన్నం వేణు, కొండ్రు వెంకటేష్, రామ్ రెడ్డి, కే. వెంకట్రావు, అత్తి తిరుపతి, శెట్టి రాజేందర్, కౌటం సురేష్, ఎం. వెంకటేశ్వర్లు, నోముల శ్రీకాంత్, మురళి, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, షిఫ్ట్ ఇన్‌చార్జిలు, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సాధన వేన ప్రభాకర్, బి. ఏమంత కుమార్ ఆలపించిన విప్లవ గీతాలు, కార్మిక గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. చివరగా ఏఐటీయూసీ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక ఐక్యతను మరింత బలోపేతం చేసి, హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని కార్మిక నేతలు ప్రతిజ్ఞ చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.