మందమర్రిలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలే మార్గం ఏఐటీయూసీ నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియాలోని కేకే-5 గని, కేకే ఓసీపీ ప్రాజెక్టు, ఏరియా వర్క్‌షాప్, సివిల్ డిపార్ట్మెంట్తో పాటు ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయం వద్ద పిట్ కార్యదర్శుల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్,...