NIGAMA MEDIA (P) LTD
15.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 27, 2026

పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాల్లో పనిచేయండి.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఎన్నికల బరిలోకి దిగే నేతలకు బీజేపీ కీలక సూచన!
తెలంగాణ నేతలకు సునీల్‌ బన్సల్‌ దిశానిర్దేశం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేసి, తమ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ సూచించినట్లు సమాచారం. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, స్థానిక ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన నేతలకు సూచించినట్లు తెలిసింది.

క్షేత్రస్థాయిపై ప్రత్యేక దృష్టి…..

పార్టీ పదవులకే పరిమితం కాకుండా నియోజకవర్గాల్లో ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని బన్సల్‌ పేర్కొన్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, స్థానికంగా పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

నేతల పనితీరుపై సమీక్ష……

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన సునీల్‌ బన్సల్‌.. ఆదివారం పార్టీ నాయకుల పనితీరు, సంస్థాగత వ్యవహారాలు, రానున్న ఎన్నికలకు పార్టీ సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో నాయకుల క్రియాశీలత, ప్రజలతో వారి సంబంధాలు, పార్టీ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.

ముందస్తు సన్నద్ధతపై దృష్టి……

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకులు ముందస్తుగానే తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేలా బీజేపీ నాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పార్టీ పదవులు నిర్వహిస్తూనే ఎన్నికలపై దృష్టి సారించాలా? లేక పదవులకు రాజీనామా చేసి పూర్తిస్థాయిలో నియోజకవర్గ రాజకీయాల్లో నిమగ్నం కావాలా? అనే అంశం రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.