NIGAMA MEDIA (P) LTD
8.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 26, 2026

తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మోర్చా నేతలకు రేఖా శర్మ దిశానిర్దేశం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల సహ ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ ఆధ్వర్యంలో అన్ని మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేఖా శర్మ పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మోర్చాల నాయకులతో చర్చించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి పార్టీ విధానాలు, కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ లక్ష్యాల సాధనకు అన్ని మోర్చాలు చురుకైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు , రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్ తో పాటు వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రేఖా శర్మ ను శాలువాతో సత్కరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా మోర్చాల సమన్వయంతో పార్టీ కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.