NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 26, 2026

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో జాప్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నవంబర్ 5న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి
పెద్దపల్లి నోయోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని పెద్దపల్లి నోయోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల వివరాల నమోదు కోసం వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నప్పటికీ, అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యమకారుల సమస్యలపై స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2026 నవంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.