పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాల్లో పనిచేయండి.

ఎన్నికల బరిలోకి దిగే నేతలకు బీజేపీ కీలక సూచన! తెలంగాణ నేతలకు సునీల్‌ బన్సల్‌ దిశానిర్దేశం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేసి, తమ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్‌ సూచించినట్లు సమాచారం. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, స్థానిక ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన నేతలకు సూచించినట్లు తెలిసింది....