NIGAMA MEDIA (P) LTD
8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 9, 2026

ముదిరాజ్‌ల హామీలను వెంటనే అమలు చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి
ముదిరాజ్ బంధు, ప్రమాద బీమా, మూడెకరాల భూమి కల్పించాలి
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్‌

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తెలంగాణలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డి, బీబీపేట ప్రాంతాల్లో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ముదిరాజ్‌లకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చడంతో పాటు, ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ముదిరాజ్ బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ముదిరాజ్ కుటుంబాలకు ప్రతి నెలా పెన్షన్ అందించాలని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతి ముదిరాజ్‌కు ప్రమాద బీమా కల్పించాలి

చేపల వేటకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు మరణించినా, వ్యవసాయ పనులు, పండ్ల తోటల్లో పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ లేదా ఇతర ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని నర్సింలు కోరారు. సాధారణ మరణం సంభవించిన సందర్భాల్లోనూ బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సూచించారు. ప్రమాద బీమా కింద రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి

ముదిరాజ్ కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు. ఆ భూముల్లో జామ, ఇతర పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్‌ల జీవనోపాధి, ఆర్థిక స్వావలంబనకు భూమి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రతి మండలంలో ముదిరాజ్ భవనాలు నిర్మించాలి

ముదిరాజ్‌ల సంఘటిత శక్తిని పెంపొందించేందుకు ప్రతి మండలంలో ముదిరాజ్ భవనాన్ని నిర్మించాలని, ప్రతి గ్రామంలోనూ చిన్న భవనాలను ఏర్పాటు చేయాలని నర్సింలు డిమాండ్ చేశారు. ఈ భవనాల ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సమావేశాలు నిర్వహించుకొని సామాజిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వం వెంటనే భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌ల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని నర్సింలు సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ సహా ఏ పార్టీ అయినా ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ముందుకు రావాలని అన్నారు. ముదిరాజ్‌లకు ప్రాధాన్యత ఇచ్చి, వారి డిమాండ్లను నెరవేర్చే పార్టీకే మద్దతు ఇచ్చే అంశాన్ని సమాజం పరిశీలిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను అమలు చేయకపోతే, రాష్ట్రస్థాయి పిలుపు మేరకు ముదిరాజ్‌లను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముదిరాజ్‌ల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సమాజమంతా ఐక్యంగా ముందుకు రావాలని కొరివి నర్సింలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.