NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 7, 2026

దసరా నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

జిల్లాలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలను దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గృహ సముదాయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల పరిస్థితిని సమీక్షించారు. మిగిలి ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

దసరా నాటికి గృహ సముదాయాలను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పనుల పూర్తిలో జాప్యం లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని, లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు, అప్పగింతకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్, క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు మందమర్రి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.