కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఇందిరమ్మ ప్రభుత్వంతోనే నిరుపేదలకు పూర్తి సబ్సిడీతో ఇళ్లు మంజూరై, సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ ఐరేని నర్సయ్య అన్నారు. దోమకొండలో అచ్చె రవి–కృష్ణవేణి, కర్రె రజని–శ్యామ్, వడ్ల రాజమణి–శ్రీనివాస్‌లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్ లబ్ధిదారులకు బట్టలు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సీతారాం మధు, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, చేనేత సహకార సంఘం చైర్మన్ బత్తిని సిద్ధ రాములు, షమ్మీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

