NIGAMA MEDIA (P) LTD
3.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 22, 2026

మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నెలకు రూ.10 వేల జీవనభృతి అందించాలి
ముదిరాజ్ మహాసభ
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవెన్న స్వప్న ముదిరాజ్ ఆధ్వర్యంలో మత్స్యకారుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మత్స్యకారుల సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మత్స్యకారుల కుటుంబాలకు నెలకు రూ.10 వేల జీవనభృతి అందించాలని కోరింది. మత్స్యకారుల హక్కులు, సంక్షేమం, వృత్తి భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

తెలంగాణలోనే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని నాయకులు కోరారు. అది సాధ్యం కాని పక్షంలో ప్రతి మత్స్యకారుల సొసైటీకి నేరుగా నిధులు కేటాయించాలని సూచించారు. ప్రతి సొసైటీకి ప్రత్యేక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.ప్రమాదాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధితో పాటు వారి వృత్తికి భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ పోతరవేణి క్రాంతి ముదిరాజ్, ప్రగతి మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉస్తేం శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు నూనె రాజేష్ రాజేశ్వర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సరోజన ముదిరాజ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండు రాజు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు వీరబోయిన రాజేందర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ముదిరాజ్, సుంకరి పోతన ముదిరాజ్, మహిళా నాయకురాలు, మంథని కార్పొరేటర్ సాగర్ల వాసవి ముదిరాజ్, గడ్డం లక్ష్మీ ముదిరాజ్, కలవేని రవి ముదిరాజ్, ప్రగతి మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కారుపాకల రమేష్ ముదిరాజ్, కలవైన సతీష్ కుమార్ ముదిరాజ్, మౌటం మల్లికార్జున్ ముదిరాజ్, మౌటం శ్రీకాంత్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.