తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘన సత్కారం
స్వాగతం పలికిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
భారత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రజనీష్ జైన్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి తెలంగాణ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయానికి రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మైనార్టీ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.

