CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 10:35 pm Posted By: coalbelt 24 News

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కు ఘన స్వాగతం

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘన సత్కారం
స్వాగతం పలికిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భారత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు.

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రజనీష్ జైన్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి తెలంగాణ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయానికి రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మైనార్టీ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});