కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
బెల్లంపల్లి సమీపంలోని కేఆర్ కుంగ్ఫూ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కుంగ్ఫూ, కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీల్లో మందమర్రి సింగరేణి పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని కే. ఆరాధ్య, 8వ తరగతి విద్యార్థిని కే. రిషిత గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జె. పురుషోత్తం విజేతలను అభినందించి, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేసి ఘనంగా సత్కరించారు.
విద్యార్థినులు సాధించిన విజయానికి కృషి చేసిన కుంగ్ఫూ, కరాటే శిక్షకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

