రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో సింగరేణి విద్యార్థినుల ప్రతిభ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బెల్లంపల్లి సమీపంలోని కేఆర్‌ కుంగ్‌ఫూ సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 20న నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే ఛాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో మందమర్రి సింగరేణి పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని కే. ఆరాధ్య, 8వ తరగతి విద్యార్థిని కే. రిషిత గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ జె. పురుషోత్తం విజేతలను అభినందించి, మెడల్స్‌, సర్టిఫికెట్లను అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థినులు సాధించిన విజయానికి కృషి...