NIGAMA MEDIA (P) LTD
20.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వారి సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని శ్రీ గణనాథుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నరేంద్ర మోదీ పేరు మీద ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవం చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో కీలక పాత్ర పోషించిన యోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ సీనియర్ నాయకులు డి.వి. దీక్షితులు, రామటంకి దుర్గరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి శనిగారపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి ఓదెలు, బొడ్ల భూపతి, గాదె రాములు, ఓం ప్రకాష్, సత్యంబాబు, గణపతి, శేఖర్, ప్రవీణ్, శంకర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.