తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వారి సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని శ్రీ గణనాథుని ఆలయంలో ప్రత్యేక...