NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

కుంగ్‌ఫు రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ ట్రోఫీ ఆవిష్కరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రి, సెప్టెంబర్ 16:

సోమగూడెంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 20న నిర్వహించనున్న కుంగ్‌ఫు రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల ట్రోఫీని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కుంగ్‌ఫు సంఘ సభ్యులు కుందెళ్ల రవి, ప్రసాద్, ఒలింపిక్ సంఘం కోశాధికారి కనపర్తి రమేష్‌లు మందమర్రి జీఎం కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి పోటీలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. అనంతరం సంఘ సభ్యులు జీఎంను శాలువాతో సత్కరించారు.

ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో సుమారు 20 నుంచి 25 జిల్లాల నుంచి 600 మంది వరకు క్రీడాకారులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మార్షల్ ఆర్ట్స్ పోటీలను నిర్వహిస్తున్న కుంగ్‌ఫు సంఘం సభ్యులను అభినందించారు. కుంగ్‌ఫు అత్యంత ప్రాచీనమైన మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటని, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలబాలికలు ఆత్మరక్షణ కోసం కుంగ్‌ఫు వంటి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మార్షల్ ఆర్ట్స్ అభ్యసించేలా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.