కుంగ్‌ఫు రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ ట్రోఫీ ఆవిష్కరణ

మందమర్రి, సెప్టెంబర్ 16: సోమగూడెంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 20న నిర్వహించనున్న కుంగ్‌ఫు రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ పోటీల ట్రోఫీని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కుంగ్‌ఫు సంఘ సభ్యులు కుందెళ్ల రవి, ప్రసాద్, ఒలింపిక్ సంఘం కోశాధికారి కనపర్తి రమేష్‌లు మందమర్రి జీఎం కార్యాలయంలో రాధాకృష్ణను కలిసి పోటీలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. అనంతరం సంఘ సభ్యులు జీఎంను శాలువాతో సత్కరించారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో సుమారు 20...