NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 23, 2026

క్రీడలతో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఉత్సాహంగా ఆత్యాపాత్య జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

క్రీడలు ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ అన్నారు. శనివారం ముల్కలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో నిర్వహించిన జూనియర్ బాలబాలికల ఆత్యాపాత్య జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా కనపర్తి రమేష్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల ద్వారా మంచి కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని, చదువులోనూ రాణించాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఆత్యాపాత్య ఎంపిక పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా ఆత్యాపాత్య ఇన్‌చార్జి కార్యదర్శి గాందర్ల సంతోష్, జాతీయ స్థాయి రిఫరీ పీడీ విశాల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 9 మండలాల నుంచి సుమారు 110 మంది క్రీడాకారులు పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపిక చేశారు.

ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు మందమర్రి పట్టణంలో కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం తుది జట్టును ఎంపిక చేసి నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

జూనియర్ బాలికల ప్రాబబుల్స్ జట్టు

అక్షిత, వైష్ణవి, ప్రణవి, రిషిక, సాయి శ్రీ, కల్పన, వంశిక, ప్రత్యేష్ట్ర రావు, పవిత్ర, సాయి అక్షిత, ప్రియాంక, శ్రద్ధ రాణి, జాన్వి, అవంతిక, ప్రణతి ఎంపికయ్యారు.

జట్టు మేనేజర్: ఎం. అశ్విని
జట్టు కోచ్: గాందర్ల సంతోష్

జూనియర్ బాలుర ప్రాబబుల్స్ జట్టు

సంజయ్, అంజి, రాము, సాయి, సహజ్, సుశాంత్, సాయి, చరణ్, రిషివర్ధన్, జస్వంత్, సృజన్, ప్రణయ్ మురళి, రోహిత్, నిహాల్, రామేశ్వర్, స్నేహిత్, విశ్వ ఎంపికయ్యారు.

జట్టు మేనేజర్: శ్రీకాంత్
జట్టు కోచ్: సాయి

ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కె. మహేశ్వర్‌రావు, పేరెంట్స్ కమిటీ సభ్యులు సంతోష్, శ్రీనాథ్, హోస్ట్ స్కూల్ పీడీ/పీటీలు పున్నం, శ్రీకాంత్, పీడీలు/పీటీలు విశాల, ఆకృతి, దేవేందర్, ప్రేమ్, సాయికుమార్, సురేష్, అశ్విని, కోచ్ సునార్కర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహకులు, కోచ్‌లు, పీడీలు, పీటీలు, క్రీడాకారులను అతిథులు అభినందించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.