క్రీడలతో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి
ఉత్సాహంగా ఆత్యాపాత్య జిల్లా స్థాయి ఎంపిక పోటీలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్రీడలు ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ అన్నారు. శనివారం ముల్కలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో నిర్వహించిన జూనియర్ బాలబాలికల ఆత్యాపాత్య జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కనపర్తి రమేష్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలకపాత్ర...