NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 23, 2026

‘కాకా’గా వస్తున్న చిరంజీవి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు
చిరు–బాబీ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో భారీ హైప్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయవంతమైన జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో చిరంజీవి అభిమానుల్లో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘Mega158’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘కాకా’ టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో చిరంజీవి ‘కె. సత్యం’ అనే సూపర్‌వైజర్ పాత్రలో కనిపించారు. ఆక్వా రంగానికి సంబంధించిన నేపథ్యంతో కథ సాగుతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.

చెన్నై టీమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని చిరంజీవి భరోసా ఇవ్వడంతో వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం సునీల్ పండుగకు లీవ్ అడగగా చిరంజీవి తిరస్కరించడం వంటి సన్నివేశాలు కామెడీ టచ్‌తో ఆకట్టుకున్నాయి.

ఇక గెటప్ శ్రీను స్కూటర్ కీస్ నీటిలో పడిపోవడం, ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం, రిమోట్‌లోని మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే ప్రయత్నంలో తుపాకులు బయటపడటం వంటి సన్నివేశాలు గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు కామెడీకి కూడా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టమవుతోంది.

మధ్యవయస్కుడైన ‘సత్యం’ పాత్రలో చిరంజీవి హుందాగా కనిపించడంతో పాటు ఆయన గెటప్, స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కథకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా పాత్ర, నేపథ్యం, యాక్షన్ అంశాలపై మాత్రమే గ్లింప్స్‌లో హింట్ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్ మరోసారి రావడంతో ‘కాకా’పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గ్లింప్స్‌ను బట్టి చూస్తే బాబీ మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ చిత్రంలో రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘కాకా’ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు–బాబీ జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.