కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లారి లింగం కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.
ఇంట్లోని బీరువాను కూడా పగులగొట్టి అందులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్లు బాధితుడు బీబీపేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

