CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 10:56 pm Posted By: coalbelt 24 News

తుజాల్‌పూర్‌లో బంగారం, వెండి చోరీ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లారి లింగం కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇంట్లోని బీరువాను కూడా పగులగొట్టి అందులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్లు బాధితుడు బీబీపేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});