తుజాల్‌పూర్‌లో బంగారం, వెండి చోరీ
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లారి లింగం కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బీరువాను కూడా పగులగొట్టి అందులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్లు బాధితుడు బీబీపేట మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు....