NIGAMA MEDIA (P) LTD
19.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, August 18, 2026

మండల ప్రజావాణికి 9 అర్జీలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సమస్యల పరిష్కారానికే మండల స్థాయి ప్రజావాణి
23 శాఖల అధికారుల హాజరు
ప్రత్యేక అధికారి రాజేశ్వర్

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రజావాణి ప్రత్యేక అధికారి ఎన్. రాజేశ్వర్ తెలిపారు. సోమవారం మందమర్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజావాణి ప్రత్యేక అధికారి ఎన్. రాజేశ్వర్, మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ శర్మ, క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో పాటు 23 శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 9 అర్జీలు స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 6 అర్జీలు, పంచాయతీరాజ్ శాఖకు 1, మున్సిపల్ శాఖకు 1, ఇతర విభాగానికి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు సౌకర్యవంతంగా ప్రభుత్వ సేవలు, సమస్యల పరిష్కారం అందించడమే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రత్యేక అధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.