మండల ప్రజావాణికి 9 అర్జీలు
సమస్యల పరిష్కారానికే మండల స్థాయి ప్రజావాణి 23 శాఖల అధికారుల హాజరు ప్రత్యేక అధికారి రాజేశ్వర్ కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రజావాణి ప్రత్యేక అధికారి ఎన్. రాజేశ్వర్ తెలిపారు. సోమవారం మందమర్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి ప్రత్యేక అధికారి ఎన్. రాజేశ్వర్, మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ శర్మ, క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో పాటు...