కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేటలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ నేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.సంఘం కార్యదర్శి ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను వినియోగించాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో చేనేత కార్మికులు కీలక పాత్ర పోషించారని, అప్పటి నుంచి ఖాదీ జాతీయ వస్త్రంగా గుర్తింపు పొందిందన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ చరకాను తిప్పుతూ స్వదేశీ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సేవలను గుర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ 2015లో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం ఆవరణలో 12 మొక్కలను నాటడంతో పాటు చేనేత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నేత కార్మికుడు భూమలింగాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుమ్మ రవీందర్, కార్యదర్శి తుమ్మ మచ్చేందర్, కోశాధికారి శివరాత్రి రామచంద్రం, డైరెక్టర్లు ఒల్లెల దేవేందర్, గడీల మారుతి, శర్బనీ సంతోష్, కన్నా లక్ష్మి, మెరుగు శారద, భూమలింగం, భాస్కర్, కారంపూరి వేణు, రాజేశం, లక్ష్మణ్, చింతకింది వేణు, రమేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు

