NIGAMA MEDIA (P) LTD
15 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, August 8, 2026

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (NMNF) డే సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆదిల్‌పేట గ్రామంలో వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు.సేంద్రియ వ్యవసాయంలో కూరగాయల పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లు, కీటకాల నివారణకు అనుసరించాల్సిన సహజ పద్ధతులు, జీవామృతం, దశపర్ణి కషాయం, వేప ఆధారిత ద్రావణాలు వంటి సేంద్రియ నివారణ చర్యలపై రైతులకు వివరించారు.

అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల దిగుబడులు సాధించే విధానాలను అధికారులు రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోతు ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, కృషి సఖిలు, ఆదిల్‌పేట గ్రామ రైతులు పాల్గొన్నారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.