ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (NMNF) డే సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆదిల్‌పేట గ్రామంలో వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు.సేంద్రియ వ్యవసాయంలో కూరగాయల పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లు, కీటకాల నివారణకు అనుసరించాల్సిన సహజ పద్ధతులు, జీవామృతం, దశపర్ణి కషాయం, వేప ఆధారిత ద్రావణాలు వంటి సేంద్రియ నివారణ...