15.6 C
Munich
Friday, August 7, 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,660గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.489 పెరిగి రూ.1,53,149కు చేరుకుంది.

అదే విధంగా, బంగారు ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,250గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం నాటికి కిలో వెండి ధర రూ.723 పెరిగి రూ.2,33,221కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరల పెరుగుదల, డాలర్ మారకం విలువలో మార్పులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.