NIGAMA MEDIA (P) LTD
8.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 5, 2026

ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

రైతులకు నిబంధనల ప్రకారం ఎరువులు అందించడంతోపాటు, ఎరువుల విక్రయాల్లో పారదర్శకతను పాటించేలా చూడటమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ అధికారులు గురువారం మందమర్రి మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.

ఇంటర్నల్ స్క్వాడ్ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా మంచిర్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మామిడి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయితో కలిసి పులిమడుగు, మందమర్రి గ్రామాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. డీలర్లు తమ స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని ఏడీఏ సూచించారు. ప్రతిరోజూ స్టాక్ బోర్డును తప్పనిసరిగా అప్‌డేట్ చేస్తూ, దుకాణంలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

అలాగే ఈ-పాస్ యంత్రంలో నమోదైన ఎరువుల నిల్వలకు, దుకాణంలో వాస్తవంగా ఉన్న నిల్వలకు (గ్రౌండ్ బ్యాలెన్స్) ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని డీలర్లకు స్పష్టం చేశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతోపాటు, అధిక ధరలకు విక్రయించడం, అక్రమ నిల్వలు, ఇతర అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ శాఖ నిబంధనలను ఉల్లంఘించే డీలర్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ మామిడి కృష్ణ స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.