కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ, దోమకొండ పరిధిలో ఇంకా eKYC పూర్తి చేయని భారత్ గ్యాస్ వినియోగదారులు వెంటనే తమ eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకుడు బాసెట్టి నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉద్యోగాలు, చదువులు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, ఈ వారం బోనాల పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చే వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దోమకొండకు వచ్చిన వెంటనే శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వచ్చి తమ eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
ఆగస్టు 5వ తేదీ తరువాత కూడా eKYC పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ కనెక్షన్లు నిలిపివేయబడే (బ్లాక్ అయ్యే) అవకాశం ఉందని తెలిపారు. దీంతో గ్యాస్ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశమున్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే eKYC పూర్తి చేసుకోవాలని సూచించారు.
అందువల్ల eKYC చేయించుకోని వినియోగదారులందరూ ఆలస్యం చేయకుండా శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ, దోమకొండను సంప్రదించి తమ వివరాలను ధృవీకరించుకుని eKYC పూర్తి చేసుకోవాలని నిర్వాహకుడు బాసెట్టి నాగేశ్వర్ కోరారు.

