EKYC చేయని భారత్ గ్యాస్ వినియోగదారులకు అత్యవసర విజ్ఞప్తి

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ, దోమకొండ పరిధిలో ఇంకా eKYC పూర్తి చేయని భారత్ గ్యాస్ వినియోగదారులు వెంటనే తమ eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకుడు బాసెట్టి నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాలు, చదువులు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, ఈ వారం బోనాల పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చే వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దోమకొండకు వచ్చిన వెంటనే శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి...